ఎన్ని అడ్డంకులు వచ్చినా.. పోలవరం నిర్మిస్తామన్నారు మంత్రి అంబటి రాంబాబు. మంత్రిగా అవకాశం ఇవ్వడం బాద్యతగా ఫీలవుతున్నానని.. దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ణాన్ని పూర్తి చేస్తానని ప్రకటన చేశారు. ఏపీలో అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న సీఎం జగన్ కి అండగా ఉంటానని.. పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్ అని తెలిపారు.
పోలవరం ఏపీకి వరమరి,, పోలవరంతో ఏపీలో రైతులందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తానని… పోలవరంపై అడ్డంకులని అధిగమిస్తామని వెల్లడించారు. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి పరిస్ధితులు ఎందుకు వచ్చాయి..? డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సందర్భాలు ఏ ప్రాజెక్టులోనూ లేవని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని… రూ. 400 కోట్ల బిల్లులు కూడా తీసేసుకున్నారని ఆగ్రహించారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి రూ. 2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారని.. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమని.. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావిడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారని వెల్లడించారు. చంద్రబాబు ధనదాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి అని.. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమానే ఈ దుస్దితికి కారణమన్నారు.