ఆ మందు వాడితే క్యాన్సర్ వస్తుంది… జాగ్రత్త…!

-

ఈ మధ్య కాలంలో ప్రాణాలు కాపాడే మందులు కూడా ప్రాణాల మీదకు తెస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. కొన్ని రకాల మందులు మరీ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఒక మందు గురించి అమెరికా సంచలన విషయం చెప్పింది. ర్యానిటిడిన్ (Ranitidine) అనే మందుని కడుపులో అల్సర్లను పోగొట్టేందుకు వాడుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం కూడా దీనిని వినియోగిస్తూ ఉంటుంది.

అయితే ఇది అంత మంచిది కాదని దీన్ని వాడటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని… ఈ మందుతో తయారు చేసే ఉత్పత్తులను వెనక్కు తీసుకోవాలని అమెరికా మందుల నియంత్రణ సంస్థ USFDA ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే దీన్ని నిషేధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం దీని ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలు ఆపేయాలని కోరింది ఆ సంస్థ.

ఇక చెప్పింది US FDA కాబట్టి అన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దేశంలో దీని వాడకం ఎక్కువగానే ఉంటుంది. దీనిని మన దేశం కూడా నిషేధించే అవకాశాలు కనపడుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఏ విధమైన ప్రకటన చేయలేదు. ర్యానిటిడిన్‌లో ఎన్‌-నైట్రోసొడిమెథైలమైన్‌ (NMDA) అనే కాన్సర్‌ కారకాలు ఉన్నాయని పరీక్షల్లో తెలిసింది. రెండేళ్ళ క్రితమే దీనికి సంబంధించి వార్తలు రావడం తో ఆపేశారు. భారత ఫార్మా కంపెనీలు దీనిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news