అమెరికాకు భారీ ముప్పు, పది లక్షలకు కరోనా కేసులు…!

-

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టినా సరే కరోనా వైరస్ మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఏ విధంగాను కనపడటం లేదు. అక్కడ ప్రస్తుతం దాదాపుగా మూడు లక్షలకు కరోనా కేసులు చేరుకున్నాయి. 8 వేల మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగడం అక్కడి ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది.

అయితే రాబోయే రెండు వారాల్లో కరోనా కేసులు మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ దాదాపు ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు వారాల్లో ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడే అవకాశాలున్నాయి. అయితే దీనికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత జీరో నుంచి 5 డిగ్రీలు ఉందని చెప్తున్నారు.

గత రెండు వారాలుగా ఆ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకే అక్కడ కరోనా వేగంగా పెరుగుతుందని, ఇంకా పెరుగుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో సీరియస్ గా చర్యలు చేపట్టడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దేశీయ అంతర్జాతీయ విమానలాను ట్రంప్ సర్కార్ ఆపే విధంగా కనపడటం లేదు. అందుకే కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version