దేశం ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉందా…? కరోనా వైరస్ ని దేశం ముంచిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ క్రమంగా మన దేశంలో పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలకు దగ్గరగా ఉంది. వీరిలో మరణాలు తక్కువగానే ఉన్నాయని, అవి రెండు వారాల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయినా సరే కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అయితే దీనికి కారణం ప్రధానంగా ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే. వారి నుంచే కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణాలో శుక్రవారం ఒక్క రోజే 75 కరోనా కేసులు బయటపడటం తో రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన మొదలయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఇక తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర లో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నాయి. వందల కేసులు నమోదు కావడం తో కేంద్ర ప్రభుత్వంలో అలజడి మొదలయింది. ఆ రాష్ట్రాల్లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన దేశంలో వ్యక్తమవుతుంది. ప్రతీ నిమిషం అప్రమత్తంగా ఉన్నా సరే కేసులు పెరగడం మాత్రం ఇప్పుడు నిజంగా ఆందోళన వ్యక్తమవుతుంది.