మేయర్లు, గవర్నర్ల తిట్లతో ట్రంప్ చెవుల్లో రక్తం…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఇప్పుడు అక్కడ మేయర్లు, గవర్నర్లకు చికాకుగా మారింది. ఇంత జరుగుతున్నా సరే ఇంత మంది కరోనా బారిన పడుతున్నా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా సరే ట్రంప్ మాత్రం ఆర్ధిక పరిస్థితి గురించి ఆలోచిస్తూ విమానాలను, మెట్రో రైళ్ళను ప్రజా రవాణాను ఆపడం లేదు. లాక్ డౌన్ ప్రకటించు గురు అన్నా గాని ఆయన మాట వినడం లేదు.

అంతర్జాతీయ విమానాశ్రయాలు పని చేస్తున్నాయి, విమానాలు తిరుగుతున్నాయి. దేశీయ విమానాలు యధేచ్చగా 50 రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలను ఆపాలని సూచించినా సరే ట్రంప్ మాత్రం వినడం లేదు. ఒక పక్క మూడు లక్షలకు చేరువలో కరోనా బాధితులు ఉన్నారు. అయినా సరే ఆయన మారకపోవడంతో, అమెరికాకు నువ్వు దరిద్రం అని తిడుతున్నారు అక్కడి మేయర్లు.

మొన్నీ మధ్య న్యూయార్క్ గవర్నర్ లాక్ డౌన్ ప్రకటించాలని భావించారు. అయితే ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో… నా రాష్ట్రం మీద నీ బోడి పెత్తనం ఏంటీ అంటూ మండిపడ్డారు. విమానాలు ఆపవయ్యా బాబూ అంటూ మండిపడ్డారు మియామి మేయర్. ఇంత జరుగుతున్నా నీకు మైండ్ పని చేయడం లేదా అంటూ మియామి మేయర్ తీవ్ర విమర్శలు చేసారు. అమెరికా నువ్వు గద్దె దిగేలోపు శవాల గుట్ట అవుతుంది అంటూ మరో మేయర్ ట్రంప్ ని నేరుగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news