అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు అనగానే ఆయన ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఆయనకు ఇష్టమైన ఫుడ్ ని అందించే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది మన ప్రభుత్వం. ఆయనకు నచ్చిన ఆహారాన్ని వడ్డించడానికి సిద్దమయ్యారు. ఇందుకోసం ఒక ప్రత్యేక మెనూని కూడా సిద్దం చేసారు. అందులో రకరకాల వంటలు సిద్దం అయ్యాయి.
రెండ్రోజుల భారత పర్యటనలో, వెజిటేరియన్ (శాఖాహారం) ఆహారాల్ని ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఫార్చూన్ లాండ్ మార్క్ హోటల్లో ప్రముఖ చెఫ్ సురేష్ ఖన్నా నేతృత్వంలో వీటిని సిద్దం చేస్తున్నారు. సురేష్ ఖన్నాకు మోడీ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సురేష్ ఖన్నా తోనే ఎవరైనా అతిధులు వస్తే వంటలు ప్రిపేర్ చేయించే వారు. మొదటి సారి భారత్ కి వచ్చిన ట్రంప్ కి ఆయనే వండుతున్నారు.
మోడీ సూచన మేరకు, గుజరాతీ ఆహార పదార్థాల్ని అహ్మదాబాద్లో సిద్దం చేసారు. ఇక రాష్ట్రపతి భవన్ లో కూడా ట్రంప్ కి వడ్డించే ఆహార పదార్ధాల విషయంలో ఇవే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించకుండా కేవలం ఆయనకే ఇవ్వాలని మోడీ భావించారు. టీ నుంచి ప్రతీ ఒక్కటి ఆయనకు సురేష్ ఖన్నానే సిద్దం చేసారు. 17 ఏళ్ళుగా మోడీ కి బెస్ట్ చెఫ్ గా ఉన్నారు సురేష్ ఖన్నా.