ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యువతను టార్గెట్ చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ముఖ్యంగా ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు యువతనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన వంటి కార్యక్రమాలతో యువత ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. తాజాగా ఆయన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
విద్యా వసతి దీవెన కార్యక్రమం ద్వారా డిగ్రీ, ఆ తర్వాత చదివే విద్యార్ధులకు ప్రతీ ఏటా 20 వేల ఆర్ధిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీని ద్వారా 20 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది అంటున్నారు. ఇప్పుడు ఈ పథకం పై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం ఏ రాజకీయం అయితే చేసిందో ఇప్పుడు జగన్ అదే రాజకీయం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా యువతను ఎక్కువగా టార్గెట్ చేసారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఇది ఎక్కువగా జరిగేది. ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా యువతను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని ద్వారా సాలిడ్ ఓటు బ్యాంకు ని ఆయన నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2024 లో ఇప్పుడు విద్యార్ధులు జగన్ కి ఓటు బ్యాంకు అయ్యే అవకాశం ఉంది.
ఇక అమ్మ ఒడి పథకం తీసుకునే వారు కూడా జగన్ కి సాలిడ్ ఓటు బ్యాంకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 8 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారికి 2023, 24 సమయంలో ఓటు వస్తుంది. వారు అందరూ అప్పుడు ఆయనకు అండగా నిలిచే అవకాశం ఉంది. అందుకే జగన్ ఇప్పుడు వారి కోసమే సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. వీళ్ళు అందరూ టీడీపీ కి దూరమయ్యే అవకాశం కనపడుతుంది.