అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో కాసేపట్లో అడుగు పెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కోసం అనేక ఏర్పాట్లతో పాటుగా భద్రతా చర్యలను కూడా తీసుకున్నారు అధికారులు ఎక్కడా కూడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ఆయన ప్రయాణించే రోడ్డు నుంచి ప్రతీ ఒక్కటి కూడా అత్యంత సుందరంగా అలంకరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసారు. ఒకసారి ట్రంప్ షెడ్యుల్ చూస్తే,
భారత్‌లో ట్రంప్ ఉండేది 36 గంటలలోపే. ఆయన సుడిగాలి పర్యటన సాగే తీరు ఇది..
ఫిబ్రవరి 24 (సోమవారం)
ఉదయం 11.40 : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరిక
12.15 గం. : సబర్మతీ ఆశ్రమ సందర్శన
1.05 గం. : మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం
3.30 గం. : ఆగ్రాకు ప్రయాణం
5.15 గం. : తాజ్‌మహల్ సందర్శన
5.45 గం. : ఢిల్లీకి పయనం
7.30 గం. : ఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరిక.
రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస.
ఫిబ్రవరి 25 (మంగళవారం)
ఉదయం 10 గం.: రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం
10.30 గం.: రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులు
11.00 గం.: ప్రధాని మోదీతో హైదరాబాద్ హౌస్‌లో భేటీ
12.40 గం.: ఒప్పందాలపై సంతకాలు, సంయుక్త ప్రకటన
7.30 గం.: కోవింద్‌తో రాష్ట్రపతి భవన్‌లో సమావేశం
10.00 గం: అమెరికాకు తిరుగు ప్రయాణం