చైనా కరోనా దొంగ డ్రామా మొత్తం బయటపెట్టిన అమెరికా గూడచారి సంస్థ .. !

-

చైనా దేశం వుహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టింది. అక్కడ నుంచి లక్షల కిలోమీటర్లు వ్యాపించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అమెరికా మరియు యూరప్ దేశాలు ఈ వైరస్ వల్ల తీవ్రస్థాయిలో నష్టపోవడం జరిగింది. కానీ చైనా చుట్టుప్రక్కల దేశాల్లో మాత్రం ఈ వైరస్ ప్రభావం పెద్దగా ముందు నుండి లేదు. దీంతో ఎప్పటినుండో ప్రపంచవ్యాప్తంగా చైనా కరోనా వైరస్ ని కావాలని పుట్టించి ప్రపంచం మీదకి వదిలింది అని చాలామంది ఆరోపిస్తున్నారు.ఈ విషయంలో ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది చైనా వైరస్ అని మీడియా ముందే బహిరంగంగా అభివర్ణించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క చైనా గురించి అమెరికా గూఢచారి సంస్థ సరికొత్త విషయం బయట పెట్టింది. కరోనా వైరస్ వూహన్ లో విస్తరిస్తున్న సమయంలో విమాన ప్రయాణాలు పై నిషేధం విధించకుండా డబ్ల్యుహెచ్వో కి సరైన సమాచారం ఇవ్వకుండా చైనా వ్యవహరించడం వెనకాల కొత్త డ్రామా ఉందని అంటుంది.

 

కరోనా గురించి నిజాలు దాస్తూ.. దాన్ని తక్కువ చేసి చూపించే చైనా కరోనా మందుల దిగుమతుల్ని పెంచుకుందని, ఎగుమతుల్ని తగ్గించిందని అమెరికాకు చెందిన గూఢాచర సంస్థ తాజాగా ఓ నివేదికలో ఆరోపించింది. తమ దేశ ప్రజలను కాపాడటం కోసం వైరస్ ని ఇతర దేశాలకు వ్యాపించే విధంగా వ్యవహరించిందని చైనాపై అమెరికా ఆరోపించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version