అమెరికా సైనికుల్లో భారీగా కరోనా…!

-

అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడు కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి. అక్కడ కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అర్మీని దింపే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు అక్కడ కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలుగా ఉంది.

ఇది పక్కన పెడితే ఇప్పుడు అమెరికా సైనికుల్లో కూడా కరోనా కేసులు బయటపడటం ఆందోళన కలిగించే అంశం. వెయ్యి మంది సైనికులకు కరోనా వైరస్ సోకడం తో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా బారిన పడి కొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో గాని అక్కడి ప్రజలు మాత్రం ఇప్పుడు సైనికులకు కరోనా సోకడం తో భయపడుతున్నారు.

ఏదైనా విపత్తు వస్తే అండగా నిలిచేది సైనికులు. అలాంటి సైనికులు ఇప్పుడు కరోనా బారిన పడటం తో ఒక్కసారిగా కంగారు మొదలయింది. ట్రంప్ సర్కార్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది. న్యూయార్క్ లో ఆర్మీ ని దింపే ఆలోచన చేసినా సరే ఆ తర్వాత మాత్రం వెనక్కు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news