వెర్రి వేయి రకాలు అని పెద్దలు ఉరికే అనలేదేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని ఘటనలు చూస్తే . ఇదేం పనిరా బాబు అని అనుకునేలోపే, ఇంకో వెర్రి పనితో ఇంకొకరు రెడీగా ఉంటారు. ఒకరిని చూసి మరొకరు హద్దులు మీరి ఆకతాయి పనులు చేస్తూ, చివరకు ఏమి సాధిస్తారో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఈ కోవకి చెందినదే ఆ అమెరికాలోని యువతి కూడా, ఇంతకీ చేసిన పని ఏంటో తెలుసా…
అమెరికాలో అరోజోనా పోలీసులకి ఫోన్ చేసి, ఎవరో ఒక అమ్మాయి బట్టలు లేకుండా రోడ్ పక్కన నిలబడి ఉందని, ఆమెకు సాయం అందించమని చెప్పారు. దాంతో పోలీసులు ఉన్నపళంగా ఆ అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఒక అమ్మాయి అలా నగ్నంగా నిలబడి ఉండటం చూసి, పోలీసులు ఆ అమ్మాయికి కప్పుకోవటానికి ఒక దుప్పటిని ఇచ్చారు. అసలు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందో పోలీసులు కనుక్కునే లోపే ఆమె చెంగుమని ఒక్క దూకు దూకి పరుగు పరుగున..
పోలీసుల వాహనం ఎక్కి, అక్కడ నుంచి మెరుపులా వెళ్లిపోయింది. అది చూసిన పోలీసులు వెంటనే షాక్ లోంచి తేరుకొని, ఇంకో వాహనం తో ఆమెను వెంబడించారు. ఆమె మితిమీరిన వేగం తో కారును నడపటంవల్ల త్వరగా పట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమె నడిపే కారు టైర్ పంచర్ కావటం తో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది, ఆమె మానసిక పరిస్థితిపై ఏమిటి అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.