పదేళ్ళ బాలుడి ప్రమాదకర ఆలోచన వాడి ప్రాణాలే తీసింది…

-

అవగాహనా లేకుండా చేసే కొన్ని పనులకి మనం చాల బాధపడుతుంటాం. పెద్ద వాళ్ళే ఒక్కో సారి తప్పులు మీద తప్పులు చేస్తూ ఉంటారు, లోకం తెలియని పిల్లలకి ఏమి తెలుస్తుంది. ప్రాణాలు పోగొట్టుకునే ప్రమదాలని పసిగట్టే తెలివి వారికి ఉండదు కదా. అలాంటి పిల్లాడే ఇప్పుడు తన ప్రాణాలు చేజేతులారా పోగొట్టుకున్నాడు. తెలియకుండా చేసిన ఓ తప్పు అతడి మరణానికి కారణమయ్యింది. వివరాలలోకి వెళ్తే..

అబిద్‌జాన్ నుంచి పారిస్ వెళ్ళిన ఓ విమానం అండర్‌క్యారేజ్‌లో పదేళ్ల పిల్లాడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఎయిర్ ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది. విమాన చక్రాలు ముడుచుకునే చోట దాక్కొని ప్రయాణించడానికి ఆ కుర్రాడు యత్నించాడని చెప్పారు. ఐవరీకోస్ట్‌లోని అబిద్‌జాన్ నుంచి మంగళవారం సాయత్రం ఈ ఎయిర్‌ ఫ్రాన్స్ కి  చెందిన బోయింగ్ 777 విమానం బయలుదేరింది. బుధవారం ఉదయం పారిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం 6.40 గంటలకు మృతదేహాన్ని కనుగొన్నారని అధికారులు తెలిపారు. అయితే..

 

ఇలాంటి సంఘటనలు ఇదివరకు కూడా జరిగాయని అంటున్నారు నిపుణులు. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ ఆధారిటీ  స్టేటస్టిక్స్ ప్రకారం, 1947 నుంచి 2019 జులై 2మధ్య ఇలాంటి సంఘటనలు దాదాపుగా 40 దేశాలలో జరిగాయని తెలిపారు. చాల తక్కువ మంది ఇలాంటి ప్రయాణాలు చేసి ప్రాణాలు దక్కించుకున్నారని తెలిపింది. అయితే మొదటి సారి ఇంత చిన్నవయసు కలిగిన బాలుడు చనిపోవడం మరింత బాధని కలిగించిందని అంటున్నారు అధికారులు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news