ట్రెండ్ ఫాలో అవ్వడం ట్రెండీగా ఉండటం, విదేశాల్లో తిరగడం వంటి వాటిల్లో బాలివుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఎప్పుడు ముందే ఉంటుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా నటనలో పెద్దగా ఆమె ఆకట్టుకోలేకపోయిన ఇలాంటి విషయాలతో సోషల్ మీడియా ఎప్పుడు ఆమె వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఈ భామ.
ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న ఈ భామకు ఒక వింత, చేదు అనుభవం ఎదురైంది. బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానాల్లో తాను ఎప్పుడు ప్రయాణం చేయను అంటుంది ఆమె. వివరాల్లోకి వెళితే గత నెల రోజుల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో మూడు సార్లు ప్రయాణించి౦ది సోనం కపూర్. ఈ నెల రోజుల వ్యవధిలో విమానాల్లో తన రెండు హ్యాండ్ బ్యాగులు పోగొట్టుకుంది ఆమె.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణిస్తే, రెండుసార్లు తన బ్యాగులను పోగొట్టారని, తగిన గుణపాఠం నేర్చుకున్నానని ఇక బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు వాపోయింది ఈ 34 ఏళ్ళ బాలివుడ్ బ్యూటి.