స్టార్ లేడీ సింగర్ సూసైడ్… విషాదంలో ఫ్యాన్స్!

-

నేడు మీరు తీక్షణంగా గమనిస్తే సమాజంలో మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్న సెలేబ్రిటీలకు మైండ్ లో చాలా సమస్యలు నిత్యం వారిని వేధిస్తూ ఉంటాయి. ఆ సమస్యలే వారిని ఒక రోజు ఆత్మహత్యకు పురిగొల్పుతాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ మరియు నటి కోకో లీ చనిపోయిందట. ప్రస్తుతం ఈమెకు 48 సంవత్సరాలు కాగా, జులై 2వ తేదీన తన సొంత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఈమె డిప్రెషన్ లోకి వెళ్లిందట.. అప్పటి నుండి మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ గత రాత్రి మరణించినట్లు డాక్టర్స్ తెలియచేశారు. కోకో లీ 2001 లో క్రౌచింగ్ టైగర్ అనే సినిమాలో ” ఏ లవ్ బిఫోర్ టైం” అనే పాట పాడింది. కాగా ఈ పాట చాలా ఫేమస్ అయ్యి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయింది.

దీనితో ఆమెకు ఆస్కార్ స్టేజ్ పైన పాడే అవకాశం దక్కిది. అలా ఆస్కార్ స్టేజ్ పై ప్రదర్శన చేసిన మొదటి చైనీస్ అమెరికన్ గా కోకో లీ ఖ్యాతిని సాధించారు. ఈమె మరణంతో అమెరికాలో అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news