Amigos Trailer : అమిగోస్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. పిచ్చెక్కించిన కళ్యాణ్‌ రామ్‌

-

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా థియేటర్ల లో వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ఠ్‌ ఈ ను తెరకెక్కించాడు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ ను నిర్మించారు. ఇక బింబి సార బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ తర్వాత, కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం అమిగోస్‌ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా థియేటర్ల లో విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇక ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తి కరంగా ఉంది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ యాక్టింగ్‌ ఓ రేంజ్‌ లో ఉంది. ఈ ట్రైలర్‌ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news