ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “అమిగోస్”!

-

నందమూరి కళ్యాణ్ రామ్ బింసారా హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు అమిగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌ అయింది.

ఇక డిఫరెంట్‌ షేడ్స్‌ కలిగిన పాత్రల్లో వైవిద్యం చూపిస్తూ, మెప్పించారనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఆషీకా గ్లామర్‌, యాక్షన్ సీన్స్‌ ప్లస్‌ అయ్యాయి. సెకండ్‌ ఆఫ్‌ లో వచ్చే బాలయ్య రీమిక్స్‌ సాంగ్‌ ఎన్నో రాత్రులు సినిమాకు ప్లస్‌ అయింది. అటు కామెడీ సీన్స్‌ కూడా అదిరిపోయాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ ఫాం అండ్‌ డేట్‌ ను ఫైనల్‌ చేసుకుంది. ఈ సినిమాను నెటిఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా, ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news