Amigos Teaser : కళ్యాణ్‌రామ్‌ ‘అమిగోస్‌’ టీజర్‌ కు ముహుర్తం ఫిక్స్‌

-

గత సంవత్సరం బింబిసార సినిమాతో జోరుమీదున్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారు. కల్యాణ్ రామ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన తాజా చిత్రమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేశారు. కల్యాణ్ రామ్‌ ఇందులో పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్‌ లుక్‌తో తెలియజేశాడు డైరెక్టర్ రాజేంద్రరెడ్డి.

బింబిసారలో డ్యుయల్‌ రోల్‌లో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయబోతున్నాడని ఇన్‌ సైడ్‌ టాక్‌.. కాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రాజేంద్రరెడ్డి. గిబ్రాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ ను వదిలారు. ఈ సినిమా టీజర్‌ ను జనవరి 8వ తేదీన 11:07 AM గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news