అమిత్ షా ‘హిందీ’ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

-

అమిత్ షా చేసిన ‘హిందీ’ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లో మాట్లాడకుండా… హిందీలో పలకరించుకోవాలని అనడం తీవ్ర వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యంగా సౌత్ స్టేట్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదిగా ఆయన అమిషాపై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే మనబలం అని… భారతదేశం రాష్ట్రాల సమాఖ్య, నిజమైన వసుధైక కుటుంబం అని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఏం తినాలో.. ఏం ధరించాలో.. ఎవరిని ప్రార్థించాలో… ఏ భాష మాట్లాడాలో మీరే చెబుతారా..? అంటూ ఫైర్ అయ్యారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం బూమరాంగ్ అవుతుందని అన్నారు. నేను మొదట భారతీయుడిని, తెలుగువాణ్ని, తెలంగాణ వాడిని అని…నా మాతృభాష తెలుగు..ఇంగ్లీష్, హిందీ కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలని, హిందీని బలవంతంగా రుద్దడం మంచిది కాదని ట్విట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news