చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడు..జగన్‌ ఏం పీకలేడు – మాజీ మంత్రి

-

చంద్రబాబు చిరకాలం జీవిస్తాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు.. మా నాయకున్ని సీఎం జగన్‌ ఏం పీకలేడని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్‌ ఇచ్చాడు. మీరున్న జైలుకి చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారని.. షెల్ కంపెనీ GRPL నుంచి కొన్న భూమి కొంటె నష్టపోతారని ఫైర్ అయ్యారు. 16 నెలలపాటు జైలులో ఉన్నావు.. జగన్, నీలాంటి చరిత్ర మాకెవరికి లేదని ఎద్దేవా చేశారు.

నీ బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని… జీవోలతో తిరుపతి వెంకన్న దగ్గరకురా… ప్రమాణం చేద్దామని సవాల్‌ విసిరారు. నువ్వు చేసిన అక్రమాలు బయటపెడితే మా అంతు చూస్తావా అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. అనేక అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. మేము ప్రమాణం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నానన్నారు.

విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్.. టెక్నీకల్ గా అన్ని తెలుసు అని.. మరోసారి ఛాలెంజ్ చేస్తున్నా.. ఓసారి జీవో చదువు విసారెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. 2019లో మార్కెట్ వాల్యూకి 20శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు జీవో ఇచ్చారని.. వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఎగ్జిప్షన్ అడిగారన్నారు. నలుగురితో కమిటీ వేసి లెక్కన ప్రకారం వెయ్యి కోట్లకు ఇవ్వాలని.. కానీ నువ్వు 187 కోట్లకు అప్పనంగా ఇచ్చేశావని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news