అమిత్ షా.. నువ్వు గ్రేట్‌..నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు.. సాయి గ‌ణేశ్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌..

-

రాజ‌కీయాలు, సిద్ధాంతాలు, ప్రాంతం త‌దిత‌ర అంశాల‌ను ప‌క్క‌న పెడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిస్తున్నారు. దేశానికి హోం మంత్రి అయి ఉండి ఒక సాధార‌ణ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డంపై ఫిదా అయిపోతున్నారు. అమిత్ షా నువ్వు గ్రేట్‌.. బీజేపీకి ఇదే బ‌లం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి ఎక్క‌డ‌.. ఖ‌మ్మంలోని సామాన్య కార్య‌క‌ర్త ఎక్క‌డా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మిగ‌తా పార్టీల‌తో పోలిస్తే బీజేపీలో కార్య‌క‌ర్త‌ల‌కు ల‌భించే ప్రాధాన్యం వేరుగా ఉంటుంద‌న‌టానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. మ‌రే ఇత‌ర పార్టీలో ఇలాంటి ప‌రామ‌ర్శ‌ను ఊహించ‌గ‌ల‌మా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం.. జిల్లా స్థాయి నేత అయినా ప‌రామ‌ర్శించేవారా? అంటూ నిల‌దీస్తున్నారు.

amit-shah

ఖ‌మ్మం జిల్లాలో ఈ నెల 14న బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌గా.. చికిత్స పొందుతూ 16న క‌న్నుమూశారు. అధికార పార్టీ మంత్రి ఒత్తిడి, వేధింపుల వ‌ల్లే సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపిస్తుండ‌గా.. దీనిపై తాము ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధ‌మేన‌ని, అవ‌స‌ర‌మైతే సీబీఐ విచారణ చేసుకోవచ్చున‌ని టీఆర్ ఎస్ నేత‌లు స‌వాలు విసురుతున్నారు.

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు సాయి గణేష్‌ ఆత్మహత్య విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నేప‌థ్యంలో బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించిన సమయంలోనే అమిత్ షా ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికులు, నెటిజ‌న్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక మండ‌లస్థాయి కార్య‌క‌ర్త‌కు కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డం నిజంగా గొప్ప విష‌య‌మ‌ని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news