ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా..!

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. సిద్ధిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటలో ఎయిర్ ఫోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సిద్దిపేటకు వెళ్లనున్నారు. ఆ తరువాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్ వెళ్తారు.

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ లు అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం దోచుకోవడం.. దాచుకోవడమే తప్ప ఏం చేసింది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ కూడా చేయబోయేది ఏం లేదంటూ.. ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. కేవలం కుటుంబ పాలన మాత్రమే నడుస్తుందంటూ..ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కుటుంబ పాలనకు మారుపేరు అని చెప్పారు. గతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుటుంబ పాలన చేస్తుందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news