బ్రేకింగ్ : తెలంగాణలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

-

గ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, బీజేపీ స‌ర్కార్ ల మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ధాన్యం కోను గోలు అంశం పై రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య పెద్ద యుద్ద‌మే కొన సాగుతుంది. మీరే ధాన్యం కొనాలంటూ.. టీఆర్ ఎస్ స‌ర్కార్ అంటుంటే.. మీరే కొనాల‌ని బీజేపీ అంటుంది. ఈ త‌రుణంలోనే.. ఇవాళ తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేత‌లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ నేత‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతిని… ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని.. ఆయ‌న పిలుపునిచ్చారు. అలాగే.. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తానని ఈ సంద‌ర్భంగా హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే.. ఆయ‌న డేట్ మాత్రం ఫిక్స్ చేయ‌లేదు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల‌ని… కేసీఆర్ ట్రాప్ లో పడకండంటూ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు అమిత్ షా. ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ల‌ను అనంత‌రం అభినందించారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news