కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. జులై 29వ తేదీన అమిత్ షా హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ పర్యటనలో అమిత్ షా చాలా పెద్ద ప్లాన్ తోనే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అమిత్ షా హైదరాబాద్ లో పలు సామజిక వర్గాల నేతలు, పార్టీ ప్రముఖులు మరియు వివిధ విభాగాల పనితీరుకు సంబంధించిన వివిధ మీటింగ్ లను ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఇక తెలంగాణాలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో .. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఉన్న అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల గురించి సంస్థాగతంగా కీలక సమాచారాన్ని సేకరించి అవసరమైన మేరకు రిపేర్ లు చేయనున్నట్లు సమాచారం.
ఇక జిల్లాల వారీగా కోర్ కమిటీ , ఎన్నికల కమిటీ లకు ఏర్పాటు చేసి ప్రణాలికలు వివరించనున్నారు. ఎలాగైనా తెలంగాణాలో ఎన్నికలలో గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ పర్యటనకు అమిత్ షా రానున్నారు.