దిశా ఎన్కౌంటర్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఈ ఎన్కౌంటర్ తో సజ్జనార్ పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయన తాజాగా బాలీవుడ్ స్టార్ బిగ్ బి పై వైరల్ కామెంట్స్ చేశారు..
ఐపీఎస్ అధికారి సంజన ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ సేవలని క్వాలిటీని పెంచుతూ సజ్జనార్ ప్రయాణికుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చారు. సోషల్ మీడియా వేదిక ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రాముఖ్యతని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జనర్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ పై వైరల్ కామెంట్స్ చేశారు. అమితాబ్ బచ్చన్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ అందరికి తెలిసిందే. పదుల సంఖ్యలో కంపెనీలకు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే అమితాబ్ ప్రచారం చేస్తే ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా జనాల్లోకి బాగా వెళుతుంది. అమితాబ్ కి ఉన్న క్రేజ్ అది. దీనితో అధిక మొత్తం పారితోషికం ఆఫర్ చేసి కంపెనీలు అమితాబ్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాయి.
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023
జనాన్ని మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయొద్దని
అమితాబ్, సెలబ్రిటీలకు RTC MD సజ్జనార్ ట్వీట్#MDsajjanar #AmitabhBachchan #News18Telugu pic.twitter.com/2L2cBjYC1X— News18 Telugu (@News18Telugu) March 31, 2023
కాగా అమితాబ్ ప్రచారం చేస్తున్న ఆమ్వే అనే కంపెనీపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీగా ఉన్న ఆమ్వేపై 2022లో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ పలు మోసాలకు పాల్పడుతుండటంతో ఈడీ ఆ కంపెనీ ఆస్తులని జప్తు చేయగా.. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. కాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ కంపెనీకి ప్రచార కర్తగా ఉన్నారు. ఈ విషయంపై స్పందించిన సజ్జనార్ ట్విట్టర్ వేదికగా అమితాబచ్చన్ కు రిక్వెస్ట్ తెలిపుతూ.. ‘సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి, ఇతర సెలెబ్రెటీలకు నేను ఒక విన్నపం చేస్తున్నా. ప్రజలని మోసం చేసే, దేశ ఆర్థిక వ్యవస్థని ముంచేసే ఫ్రాడ్ కంపెనీలకు ప్రచారం కల్పించవద్దు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి అమితాబ్ ఆమ్వే కంపెనీకి ప్రచారం చేస్తున్న పిక్ పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.