హుజురాబాద్ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవగా అక్టోబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. కాగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు స్టార్ క్యాంపెయినర్ లను ప్రకటించాయి. అయితే హుజురాబాద్ ఎన్నికల కోసం బిజెపి అమిత్ షా ను కూడా రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. ఈటెల కోసం ప్రచారానికి హోం మంత్రిగా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టిఆర్ఎస్ కు దీటుగా ఈ ఎన్నికలను తీసుకున్న బీజేపీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా తో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ లో అమీషా సభను ఎక్కడ ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులు ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారానికి అయినా ఇతర సందర్భాల్లోనూ అమిత్ షా భారీ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.