Shakuntalam: శ‌కుంత‌లం డ‌బ్బింగ్ షూరూ! మ‌రీ స‌మంత ప‌రిస్థితేంటీ?

-

Shakuntalam: ఇండ‌స్ట్రీలో గత కొన్ని రోజులుగా హ‌ట్ టాఫిక్ గా నిలిచిన అంశం సామ్- చైతూల విడాకులు. మోస్ట్ ఎలిజిబుల్ క‌పుల్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవ‌డం.. అటు చిత్ర సీమ‌లోని గానీ, ఇటు అభిమానులు గాని జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే.. ఈ విష‌యంలో స‌మంత‌నే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌నే విడాకులు తీసుకుంటున్నారని కామెంట్స్ ఎక్కువ‌య్యాయి. మ‌రికొంద‌రూ.. స‌మంతకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఎవ్వ‌రూ ఏం అనుకున్నా.. ఆమె మాత్రం కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ క్ర‌మంలోనే .. తిరిగి షూటింగ్ లో పాల్గొంటుంది.


పౌరాణిక ఇతివృత్తంతో తెర‌కెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో టైటిల్ రోల్ ను ప్లే చేస్తున్నది స‌మంత‌. దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ క‌నిపించ‌బోతుంది. ఇప్ప‌టికే చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప్రారంభమైంది.

సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. ఇదే విషయం చెబుతూ… పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. అతిధి బాలన్, మల్మోత్రా శివన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సాయిమాధవ్ బుర్ర ఈ చిత్రానికి మాటలు రాయ‌గా.. శేఖర్ వి. జోసఫ్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాఫిక్స్ హైలైట్ గా నిలిచే ‘శాకుంతలం’ పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జనం ముందుకు రానుంది. ఇదే విషయం చెబుతూ… పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news