రేపే రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ

-

కరోనా లాంటి పరిస్థితి వచ్చినా… వెనకా ముందు ఇస్తూనే ఉన్నామని.. 15 ఆగస్ట్ న రైతు రుణ మాఫీ డబ్బులు బ్యాంకుల్లో వేస్తున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నదన్నారు. తాత్కాలిక ఆనందం కొందరు పొందుతున్నారని.. కానీ మేము అందరికీ ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు. దళితుల మీద ప్రేమ ఉంటే..ఢిల్లీ నుండి 40 లక్షలు తీసుకురావాలని బిజేపి కి చురకలు అంటించారు.

కేంద్రం నుంచి డబ్బులు తీసుకువచ్చి మీకున్న నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మేము 2000 కోట్లు ఇచ్చాం..దమ్ముంటె మీరు 8 వేల కోట్లు తీసుకురావలన్నారు. దళిత జాతిపై బిజేపి వైఖరి ఏంటని ప్రశ్నించారు. రెచ్చ గొట్టే చర్యలు మానుకోవాలని.. కుట్రలో మీరే కాలిపోతారని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటి వరకు దళిత బందును కనీసం స్వాగతించలేదని మండిపడ్డారు. అపోహలు నమ్మవద్దని..అర్హులైన అందరికీ దళిత బందు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రానే రాలేదని.. ఆలోపే అందరికీ దళిత బందు ఇస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news