AMR గ్రూప్‌ అధినేతకు ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2024’ అవార్డు

-

ప్రముఖ వ్యాపారవేత్త, AMR ఇండియా లిమిటెడ్‌ గ్రూప్‌ అధిపతి ఎ. మహేశ్‌ రెడ్డికి సామాజిక రంగంలో చేస్తున్న సేవలకు గాను ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2024’ అవార్డును దక్కించుకున్నారు. ముంబైలోని గ్రాండ్‌ హయాత్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మహేశ్‌ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

మైనింగ్‌, ఇరిగేషన్‌ రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎఎంఆర్‌ గ్రూప్‌ ప్రస్తుతం ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తుండగ రాబోయే రోజుల్లో సుమారు లక్ష మంది యువకులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. మైనింగ్‌ బిజినెస్‌లో ఎఎంఆర్‌ ప్రథమ స్థానంలో ఉంది. వ్యాపారరంగంతో పాటు ఆధ్యాత్మికంగానూ సేవాగుణాన్ని చాటుకునే మహేశ్‌ రెడ్డి సాయిబాబా భక్తుడు . ఆయన మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయి ఆలయానికి బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేశారు.అంతేగాక ఏపిలోని శ్రీశైలం, రాజరాజేశ్వర ఆలయం (నెల్లూరు), కాణిపాకం,పృధ్వీశ్వర ఆలయాలలో పునర్నిర్మాణ పనులను తన సొంత ఖర్చుతో చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news