గద్దర్ అవార్డులను స్వాగతిస్తున్నా: మంచు మోహన్ బాబు

-

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ పై నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ‘గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నా. ఇది సాంస్కృతిక గుర్తింపు పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనం. గద్దర్ పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి. గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం.. ఆయన చేసిన కృషికి, త్యాగానికి ఇచ్చిన గొప్ప గౌరవం’ అని ట్వీట్ చేశారు.

నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేసిన గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ,సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.వచ్చే సంవత్సరం నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news