అమృత్ పథకం టెండర్స్.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంత సడన్‌గా ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారని పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్టు జరుగుతుందని పెద్ద ఎత్తున టాక్ వస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో సయోధ్య కోసం బీఆర్ఎస్ ట్రై చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లారా? అని అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

ఇదిలాఉండగా, కేటీఆర్ ఢిల్లీ వెళ్లడానికి గల కారణాలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్ మెంట్ దొరకడంతో ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పేర్కొన్నారు. మంగళవారం కేంద్రమంత్రితో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. అమృత్ పథకం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేస్తారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తన బంధువు సృజన్ రెడ్డికి అక్రమంగా అమృత్ పథకం టెండర్లు దక్కాయని గతంలో పలుమార్లు కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news