అమృత్​పాల్ అరెస్ట్.. ఫేక్ ఎన్​కౌంటర్​కు ప్లాన్..!

-

ఖలిస్థానీ అనుకూల నాయకుడు, ‘వారీస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్​పాల్ సింగ్ అరెస్టు వ్యవహారం విషయం చర్చనీయాంశంగా మారింది. అతడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతుండగా.. వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్ మాత్రం వాటిని ఖండిస్తున్నారు. అమృత్​పాల్​ను పోలీసులు అరెస్ట్ చేశారని.. ఫేక్ ఎన్​కౌంటర్​లో హత్యకు ప్లాన్ చేశారని న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా ఆరోపిస్తున్నారు. షాకోఠ్ పోలీస్ స్టేషన్​ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అమృత్​పాల్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.

“హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేశా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తినీ పోలీసులు కొట్టకూడదు. అమృత్​పాల్​ను షాకోఠ్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి ప్రాణాలకు ముప్పు ఉంది. ఇదే విషయం హైకోర్టు పిటిషన్​లో ప్రస్తావించా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది పోలీసుల విధి. కానీ, ఇప్పటివరకు అమృత్​పాల్​ను కోర్టుకు తీసుకురాలేదు. పోలీసులకు ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. పోలీసులు ఫేక్ ఎన్​కౌంటర్​లో అతడిని చంపేయవచ్చు. తమకు దొరికిన ఈ టైమ్​ను ఉపయోగించుకొని ఏదైనా పథకం రచించే ఛాన్స్ ఉంది.”
-ఇమాన్ సింగ్ ఖారా, వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్

Read more RELATED
Recommended to you

Latest news