తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం అందించే గృహలక్ష్మీ పథకం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 10 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించి, వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ పథకం కింద తొలి దశలో నియోజకవర్గంలో 3వేల చొప్పున మొత్తం 3.57 లక్షలు, రాష్ట్ర కోట కింద 43 వేల ఇల్లు కలిపి నాలుగు లక్షల మందికి సాయం అందిస్తారు. గతంలో ఇల్లు ఉండే కూలిపోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. కాగా సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి గృహ లక్ష్మి పథకం అమలు చేయాలని కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రూ.3 లక్షల గ్రాంటుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 3 విడతల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.