అశ్లీల సందేశాలు.. వీడియో కాల్స్‌లో కిస్సులు.. అమృత్‌పాల్‌ నేరాల చిట్టా..!

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం వేట సాగిస్తున్న పోలీసులు అతడి గత చరిత్రను బయటకు తీసేందుకు ప్రయత్నించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమృత్ పాల్ కు చాలా మంది మహిళలతో అనైతిక సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్‌లు, వాయిస్‌నోట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్‌ నోట్‌లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి.

వాటిల్లో మహిళలతో టైంపాస్‌ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది. ఎటువంటి ఒప్పందాలు లేకుండా పెళ్లి చేసుకోవ‌డం.. వీడియో కాల్స్‌లో మ‌హిళ‌ల‌కు అమృత్‌పాల్ కిస్సులు ఇస్తున్న‌ట్లు ఉన్న కొన్ని మెసేజ్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మరోవైపు అమృత్‌పాల్‌ పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి ఆంగ్లవార్తా సంస్థ ‘ఎన్డీటీవీ’కి వెల్లడించారు. పంజాబ్‌లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news