ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన అమృతపాల్ సింగ్

-

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ లోక్ సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో ఓం బిర్లా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.

పెరోల్‌పై వచ్చి ఎంపీలుగా ప్రమాణం చేశారు.ప్రస్తుతం అమృతపాల్ సింగ్, ఇంజనీర్ రషీద్ ఇద్దరూ కూడా జైల్లో ఉంటున్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అమృతపాల్ సింగ్(31) పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలవగా.. రషీద్(56) జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గెలిచారు. అయితే వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద అభియోగాలు మోపబడి రషీద్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండగా.. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ అస్సాం జైలులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news