కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని సెల్ఫీ వీడియో బయటికి రావడం అలజడి రేపింది. అబ్దుల్ సలాంను ఏవిధంగా సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేధించారో బంధువులు తాజాగా మీడియాకి వెల్లడించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ వేసింది. సీఐ సోమశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.
అలానే పోలీసుల వేధింపులే కారణమనినిర్ధారణకు వచ్చింది కమిటీ. మానసికంగా శారీరకంగా వేధించారని అడిషనల్ ఎస్పీ గౌతమి తెలిపారు. అయితే ఇక నిన్న నంద్యాల వెళ్లిన డిప్యూటీ సీఎం అంజద్ భాషా అబ్దుల్ కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. అబ్దుల్ సలాం అత్మహత్య కేసు ఎక్కడా, ఎవరికీ లొంగని నిజాయితీపరుడైన ఆఫీసర్‌తో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మైనారిటీలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని చంద్రబాబు చెప్పడం హస్యస్పదంగా ఉందన్న ఆయన మీలు గుర్తు చేస్తూ ప్లకార్డు ప్రదర్శించిన నంద్యాలకు చెందిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టిన ఘనత మీదే నని ఆయన గుర్తు చేశారు. బాబు మాటలు దెయ్యలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు.