దుబ్బాక కౌంటింగ్ కి సర్వం సిద్దం.. 23రౌండ్లలో వెలువడనున్న ఫలితం…!

-

అందరి చూపు ఇప్పుడు దుబ్బాక ఫలితం వైపే… ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందని అటు బెట్టింగ్స్‌ కూడా సాగిపోతున్నాయ్‌. విపక్షం కాస్త గట్టి పోటీ ఇవ్వడంతో గెలుపెవరిదన్న ఉత్కంఠ పెరుగుతోంది. రేపు జరిగే కౌంటింగ్‌ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఈ నెల 3న దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. మొత్తం 82.61 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 86 ఉండగా ఈసారి మాత్రం కాస్త తగ్గింది. అప్పటి నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రంగా ఉన్న EVMలను రేపు బయటకు తీయబోతున్నారు. కౌంటింగ్‌ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 23 రౌండ్లలో ఫలితం వెలువడనుంది‌, ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కౌంటింగ్‌లో దాదాపు రెండు వేల మంది పాల్గోనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

ఎన్నికల్లో పోటీచేసిన ప్రతీ అభ్యర్ధి తరపున ఒక ప్రతినిధి ఉండే అవకాశం కల్పించారు. మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో ఉన్నా… ప్రధానంగా టీఆరెస్‌ బీజేపీ మధ్యే పోటీ అన్నట్టు సాగింది. ఇక పాస్‌లు లేనివారిని లోనికి అనుమతించరు. ఇక ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీస్‌ బలగాల్ని మోహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version