ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరియు అతని కుటుంబానికి ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్‌ను చైనా అందించినట్లు అమెరికా విశ్లేషకుడు ఒకరు మంగళవారం చెప్పాడు. రెండు జపాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ది నేషనల్ ఇంటరెస్ట్ థింక్ ట్యాంక్ లోని ఉత్తర కొరియా నిపుణుడు హ్యారీ కజియానిస్ మాట్లాడుతూ…
కిమ్ మరియు పలువురు ఉత్తర కొరియా అధికారులకు టీకాలు వేశారని వెల్లడించారు. అయితే ఏ కంపెనీ వ్యాక్సిన్ వేసారు అనేది మాత్రం చెప్పలేదు. అది సురక్షితమా కాదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. “కిమ్ జోంగ్ ఉన్ మరియు కిమ్ కుటుంబం మరియు అధికారులు ఇతర ఉన్నత స్థాయి అధికారులకు గత రెండు, మూడు వారాల్లో కరోనా వైరస్ కోసం టీకాలు వేసుకున్నారు అని చెప్పారు.