కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు రోజు రోజుకు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. పసిపాప అనే కనికరం కూడా లేకుండా ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు 24 గంటల పాటు ఆ చిన్నారిని హింసించాడు. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కోట్ల ముబారక్ ప్రాంతం దగ్గర ఈనెల 06న చిన్నారి కిడ్నాప్ కి గురైంది.
కిడ్నాప్ కి గురైన చిన్నారిని పోలీసులు 24 గంటల తరువాత రక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 06న ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్ కి గురైంది.. కిడ్నాప్ కు గురైన 24 గంటల్లోనే చిన్నారిని రక్షించినట్టు తెలిపారు. గంటల పాటు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపారు. చిన్నారి శరీరంపై పలు చోట్ల గాయాలు, పంటి గాట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. నేరస్థుడి నుంచి రక్షించిన తరువాత చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటికీ కూడా ఈ చిన్నారి ఈ దారుణ ఘటనను గుర్తుకు చేసుకొని భయపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.