సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అంతగా ఆసక్తి చూపరు అన్న విషయం తెలిసిందే, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అభివృద్ధి చేయాలని ఆయా అధికారులు ప్రసంగాలలో చెబుతారు కానీ వారి పిల్లలు మాత్రం మంచి పేరున్న కాన్వెంట్ స్కూల్ లోనే చేర్పిస్తు ఉంటారు కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం అందరికంటే భిన్నంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఐఏఎస్ అధికారి స్థానంలో ఉన్నప్పటికీ తన కుమారుడుని మాత్రం ఒక సాదాసీదా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పిఓ కూర్మనాథ్ పదవ తరగతి చదువుతున్న తన కుమారుని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాల లో జాయిన్ చేశాడు అయితే ఇక్కడ ఎంతో అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి విద్యార్థులకు ఎంతో మనో వికాసం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తన కుమారుని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.