రోహిత్ శర్మ కెప్టెన్ అయితేనే బాగుంటుంది.. ఎందుకంటే..!

-

ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఐదవసారి టైటిల్ విజేతగా నిలిచిన నాటి నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పు పై తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి అంటూ ఇప్పటికే ఎన్నో డిమాండ్లు వినిపించాయి అనే విషయం తెలిసిందే . ఇక ఇప్పుడు మరో ఆటగాడు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు

ఇప్పటికే వన్డేలు టి20 లకు ఇండియా కెప్టెన్ మార్పు జరగాలి అని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కీపర్ పార్థివ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారిపోయాయి. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తాను ఆడాను అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్. అయితే విరాట్ కోహ్లీ కంటి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంతో బాగుంటుందని ఎంతో ఒత్తిడిలో కూడా రోహిత్ శర్మ ఎంతో కూల్గా ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. సారథ్యంలో రోహిత్ శర్మ ఎంతో నైపుణ్యం సాధించాలని విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడూ ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇతర ఆటగాళ్లపై ఆధారపడుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news