మాజీ క్రికెటర్ల మధ్య ఆసక్తికరంగా మారిన ట్విట్ వార్

-

గ్రౌండ్‌లో గెలుపుకోసం ఆటగాళ్లు హోరాహోరీగా తలపడతారు. అయితే వారికి మద్దతుగా నెట్‌లో తలపడుతున్నారు ఆయా జట్ల మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు. తాజాగా పీటర్సన్, జాఫర్ మధ్య ట్వీట్ పోరు.. నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది..

వీరూ భాయ్.. ట్వీటాడంటే… ఆయన షాట్‌లాగే ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుంది. వసీం జాఫర్‌ తన ట్వీట్స్‌లో.. తన హాస్యాన్ని జోడించి, పంచెస్ వేస్తుంటాడు. ఇక విదేశీ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, మైకేల్‌ వాన్‌, మిచెల్‌ క్లార్క్‌, రికీ పాంటింగ్‌… ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తర్వాత తమ అంచనా తప్పని గుర్తిస్తుంటారు.

తాజాగా పీటర్సన్‌, జాఫర్‌ మధ్య జరిగిన ట్విటర్ పోరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఘోర ఓటమిని చవిచూడటంతో పీటర్సన్‌ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. భారత్‌కు శుభాకాంక్షలు.. ఇంగ్లాండ్-బి జట్టును ఓడించినందుకు అని ట్వీటాడు. దీనికి జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

పీటర్సన్‌ను ట్రోల్ చేయకండి. అతడు సరదాగా ఇలా చేస్తున్నాడు. అయితే నాకో విషయం అర్థమైందన్నాడు జాఫర్. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లాండ్ ఎలా పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు అవుతుంది? అని జాఫర్‌ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా చెందిన పీటర్సన్‌ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్‌ అయ్యేలా పంచ్‌ విసిరిన జాఫర్‌ ట్వీట్‌కు లైకుల వర్షం కురుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news