అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా ఆ సంస్థలో తనకు చెందిన రెండు బిలియన్ల డాలర్ల కన్నా ఎక్కువ విలువైన 12 మిలియన్ల షేర్లను ఆయన విక్రయించారు. ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో 11,997,698 షేర్లను అమ్మేసినట్లు అమెరికా ఫెడరల్ రెగ్యులరేటర్లకు ఇచ్చిన స్టేట్మెంట్లో బెజోస్ తెలిపారు.
ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన 50 మిలియన్ల షేర్లను విక్రయించాలని ఫిబ్రవరి 7వ తేదీన బెజోస్.. సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో లిస్ట్ చేశారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, దీని ద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న బెజోస్ ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు. బ్లూ ఆరిజన్ సహా తన మిగతా ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టడానికి బెజోస్ 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.