రామ్ చరణ్ పై ఆనంద్ మహేంద్ర ప్రశంసలు.. ఏమన్నారంటే..

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ వార్తలే కనిపిస్తూనే వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఆస్కార్ అవార్డును అందుకోబోతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా తాజాగా ఈ చిత్రానికి నాలుగు అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం హెచ్ సి ఏ లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గం ఆనంద మహేంద్ర రామ్ చరణ్ పై ప్రశంసలు వర్షం కురిపించారు..

Anand Mahindra Hails Ram Charan As ‘Global Star’

ప్రస్తుతం ఆర్ఆర్అర్ టీం మొత్తం విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా గుడ్ మార్నింగ్ టాక్ షోలో పాల్గొన్నారు చరణ్. ఈ షో ఎంత ప్రత్యేకమైనదో తెలిసిందే. కాగా రాంచరణ్ కు దక్కిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అరుదైన గౌరవంగా కూడా భావించవచ్చు. ఈ షోలో చరణ్ పాల్గొన్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆనంద్ మహేంద్ర రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు..

చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న వీడియో షేర్ చేస్తూ.. ‘ఇతను గ్లోబల్ స్టార్’ అని కామెంట్ పెట్టారు. ఆనంద్ మహేంద్రా రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అని ప్రశంసించడంతో అతని అభిమానుల్ని ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news