డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్.. ఆనంద్ మహీంద్ర రియాక్షన్.!

-

కరోనా విషయంలో ప్రపంచ దేశాలను తాజాగా మరోసారి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్య‌వ‌స్థ పునః ప్రారంభాన్ని స్వాగ‌తిస్తున్నాం. కానీ క‌రోనా పూర్తిగా వెళ్లిపోయిన‌ట్లు కాదు. ఏ ఒక్క దేశంలో కూడా మ‌హ‌మ్మారి అంతం అవ్వలేదు. కరోనాని నియంత్రించ‌డంలో మ‌నం సీరియ‌స్‌గా ఉండాలి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అన్ని దేశాలు సుర‌క్షిత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా వైర‌స్‌ను ప్ర‌పంచ‌దేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు త‌మ వ్యాపారాన్ని మొద‌లుపెట్ట‌వ‌చ్చు అని టెడ్రోస్ పేర్కొన్నారు.

అయితే టెడ్రోస్ అధనామ్ చేసిన ఈ హెచ్చరికలపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు గురి చేసే ముందు, ప్రస్తుత మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వండి అంటూ ట్వీట్ చేశారు. మమ్మల్ని మరింత భయ పెట్టకండి అంటూ అభ్యర్థించారు. తేరుకోక ముందే మమ్మల్నందర్నీ మళ్లీ డిప్రెషన్ లో ముంచొద్దంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news