మరో హార్ట్ టచింగ్ వీడియోతో ఆనంద్ మహీంద్రా ట్వీట్

-

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. కరెంట్ ఎఫైర్స్ మీద స్పందిస్తూ ఉంటారు. అలాగే తనకు నచ్చిన విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా నేటి తరం ఇన్నోవేషన్స్, నెట్టింట వైరల్ అయ్యే హార్ట్ టచింగ్ విషయాలు, వీడియోలు, పోస్టులు షేర్ చేస్తూ వాటిపై తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలా ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను షేర్ చేసుకునే ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఎక్స్ ఖాతాలో మరో ఆసక్తికర వీడియో పంచుకున్నారు.

ఓ చిన్నారి సేవాగుణం, కృతజ్ఞతాభావానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీల్ ఛైర్లో ఉన్న ఓ వ్యక్తిని రోడ్డు దాటేందుకు సాయం చేసిన ఓ బాలిక.. ఇందుకు సహకరించిన వాహనదారులకు మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడయోను షేర్ చేసిన ఆనంద్.. ‘‘ప్రపంచం మొత్తం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది’’ అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ యాడ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news