రైలు దిగుతూ మరణిస్తే వాళ్లే పరిహారం చెల్లించాలి : హైకోర్టు

-

రైలు దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదే అని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. బాధితులకు పరిహారం నిరాకరిస్తూ రైల్వే చేసిన వాదనను తోసిపుచ్చింది. రైలు దిగుతూ మృతి చెందిన ఓ ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ పీ సందేశ్ ఆదేశాలు జారీ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4లక్షలకు ఏడు శాతం వడ్డీ కట్టి ఆ మొత్తం చెల్లించాలని.. పరిహారం రూ.8లక్షల కన్నా తక్కువ ఉంటే ఇదే మొత్తంలో అందించాలని తీర్పు వెలువరించారు.

భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124-ఏ ప్రకారం ట్రైన్ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ కేసులో రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్(ఆర్సీటీ) ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ‘మృతురాలి స్వీయ తప్పిదం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు నిర్ధరణకు వచ్చిన రైల్వే ట్రైబ్యునల్ .. ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ట్రైబ్యునల్ తప్పు చేసింది.’ అని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news