నా కోసం వరుడిని వెతికినందుకు థ్యాంక్స్.. ఇక పెళ్లెప్పుడో చెప్పండి: అనన్య

-

అనన్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి.

‘మల్లేశం’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ భామ ప్రస్తుతం కెరీర్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనన్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి.

వీటిపై స్పందిస్తూ అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకోసం వరుడిని వెతికినందుకు ధన్యవాదాలు. ఇక.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో నాక్కూడా దయచేసి తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరు కాగలను’’ అంటూ సెటైర్స్ వేసింది. ప్రస్తుతం కొన్ని సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ లో దివ్వ అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాందించింది అనన్య. దీంతో అనన్యకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

ఐతే అందరు తెలుగమ్మాయిల్లాగే అనన్య కూడా పరిమితంగా పాత్రలు చేస్తుందా.. లేక గ్లామర్ షోలకు రేడీనా అన్నదే ఫిల్మ్ మేకర్స్ లో సందేహంగా ఉంది. ఇటువంటి సమయంలో కొంత మేర స్కిన్ షో చేయడానికి తనకేం అభ్యంతరం లేదని అనన్య నాగళ్ల చెబుతోందట.

ఆ మేరకు కొన్ని ఫోటో షూట్ లతో నిర్మాతలను, దర్శకులను ఆకట్టుకునే పనిలో పడింది అనన్య. గతంలో ఈమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అనంతరం ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రంలో కూడా హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.మరో వైపు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news