నటులు అవ్వాలి అంటే ఇండస్ట్రీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళల విషయంలో మాత్రం పలు అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి. అయితే నటుడుగా ఎదగడానికి అల్లు రామలింగయ్య గారు బియ్యాన్ని లంచం ఇచ్చి నాటకాలలో వేషాలు సంపాదించారట. నాటకాలకు నటులను ఎంపిక చేసే మేనేజర్ కి బియ్యం ఇచ్చి తనకి నాటకాలు, నటన పైన ఉన్న పిచ్చిని వదులుకోకుండా చివరికి నటుడు అయ్యాడు అల్లు రామలింగయ్య. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించారు. ఎంతోమంది వందలాది ప్రేక్షకులలో విలక్షణమైన నటనతో ప్రతి ఒక్కరిని కట్టిపడేశారు అల్లు రామలింగయ్య.
ఇక ఇప్పుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలలో చిరంజీవి తన మామగారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అల్లు రామలింగయ్య గారి క్రమశిక్షణ ఆయనకున్న లక్షణాల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన నిరంతరము విద్యార్థి ప్రతిక్షణం కూడా.. ఏదో ఒకటి సాధించాలనే తపన ఆయనలో ఉండేదనీ.. ఒకవైపు నటుడు గానే ఉంటూ మరొకవైపు చదువు కూడా కొనసాగించారని.. అది కూడా ఆర్ఎంపీ డాక్టర్ అయ్యారని తెలియజేశారు. నేను ఆర్టిస్టుగా సెలెక్ట్ అయ్యాక మరొక వ్యాపారం వైపు వెళ్లలేకపోయాను కానీ రాజకీయాల్లో ఏదోలా ట్రై చేశాను కానీ అది విడిచి కొట్టింది అని తెలియజేశారు చిరంజీవి.
ఆ రోజుల్లో కూడా ఆర్ఎంపి డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఫిలిమ్ ఇండస్ట్రీలో అందరికీ డాక్టర్ అయ్యారు అల్లు రామలింగయ్య గారు అని తెలియజేశారు. సినీ పరిశ్రమలో అందరికీ ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయనతో కూర్చుంటే చాలు డాక్టర్ గా మాకు ఎన్నో నేర్పించేవారు. ఇప్పటికీ మా ఇంట్లో ఆ వైద్యమే కొనసాగుతూ ఉందని తెలియజేశారు.రామారావు కృష్ణ నాగేశ్వరరావు కోట శ్రీనివాసరావు గారికి అందరికీ మందులు ఇచ్చి రోగాన్ని తగ్గించేవారు అని తెలియజేశారు చిరంజీవి.