గంజాయి ఇస్తా అని జోక్ చేశా…ఆర్యన్ తో ఛాటింగ్ పై అనన్య పాండే..!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై లో క్రూయిజ్ నౌకలో జరిగిన ఓ పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ పోలీసుల అదుపులో ఉండగా ఎన్సీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. అయితే విచారణలో ఆర్యన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తో చాటింగ్ చేసినట్టు గా గుర్తించారు. దాంతో నిన్న అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించి అధికారులు ఆమె లాప్టాప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక నిన్న అనన్య పాండే ఎన్సిబీ ముందు విచారణకు హాజరుకాగా డ్రగ్స్ పై ఆర్యన్ తో జరిగిన చాటింగ్ గురించి అధికారులు బ్యూటీని ప్రశ్నించారు. దాంతో అనన్య పాండే ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఆర్యన్ తో చాటింగ్ నిజమేనని కానీ తను కేవలం జోక్ చేసినట్లు చెప్పింది. గంజాయి కోసం ఆర్యన్ ఖాన్ అడగగా ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు సమాచారం. ఈ చాటింగ్ పైన అధికారులు ప్రశ్నిస్తే తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎవరికీ సరఫరా చేయలేదని అనన్య చెప్పినట్టు సమాచారం.