ఇంటర్ పరీక్షలు యథాతథం… తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు.ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని లంచ్ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు…ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందనీ పేర్కొంది హైకోర్టు..పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందనీ…విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటివేషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా ఇటీవలే తెలంగాణ తల్లి దండ్రులు సంఘం ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.